TGSRTC Job Notification 2025: TGSRTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు భారీ నోటిఫికేషన్..

TGSRTCలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

New Update
TGSRTC Job Notification 2025

TGSRTC Job Notification 2025

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. టీజీ ఆర్టీసీ(TGSRTC) లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,000 డ్రైవర్ పోస్టులు(Driver Posts), 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.tgprb.in/వెబ్ సైట్ లో పొందవచ్చు. 

Also Read :  గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్!

మొత్తం పోస్టులు: 1,743

డ్రైవర్ పోస్టులు: 1,000

శ్రామిక్ పోస్టులు: 743

దరఖాస్తు ప్రారంభ తేదీ:అక్టోబర్ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ అవుతుంది.

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్: ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.tgprb.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

జీతభత్యాలు:డ్రైవర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు జీతం అందిస్తారు. 

అలాగే శ్రామిక పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.16,550 నుంచి రూ.45,030 వరకు జీతం చెల్లిస్తారు.

TGSRTC Job Notification 2025

TGSRTC Job Notification
TGSRTC Job Notification

ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పోలీస్ నియామక మండలి చేపడుతోంది. నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. గతంలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు.

Also Read :  మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఆ ఛాన్స్ లేనే లేదు.. విద్యాశాఖ కీలక ప్రకటన!

ఇతర నోటిఫికేషన్స్ . .

అయితే ఆర్టీసీలో కేవలం ఈ పోస్టులే కాకుండా.. మరిన్ని ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డిపో మేనేజర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్ల వంటి వివిధ విభాగాల్లో మొత్తం 3వేలకు పైగా పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలో విడుదల కావచ్చని సమాచారం. 

Advertisment
తాజా కథనాలు