Telangana Jobs: 50 కంపెనీలు.. 3000 ఉద్యోగాలు - సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు శుభవార్త. సింగరేణి ప్రాంత యువతీ యువకుల కోసం అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సింగరేణి సౌజన్యంతో కొత్తగూడెంలో ఈ మెగాజాబ్ మేళా ఈ నెల (నవంబర్) 16వ తేదీన నిర్వహించనున్నారు.

New Update
Mega Job Mela in November 16th Kothagudem

Mega Job Mela in November 16th Kothagudem

నిరుద్యోగులకు శుభవార్త. సింగరేణి ప్రాంత యువతీ యువకుల కోసం అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సింగరేణి సౌజన్యంతో కొత్తగూడెంలో ఈ మెగాజాబ్ మేళా ఈ నెల (నవంబర్) 16వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి కొత్తగూడెం క్లబ్ (RTC బస్టాండ్ పక్కన) ప్రాంగణంలో ఈ ఉద్యోగ మేళా ప్రారంభం కానుంది.

సుమారు 50కి పైగా కంపెనీలు.. 3 వేల ఉద్యోగాలు

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారధ్యంలో ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళా ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 50కి పైగా ప్రముఖ ప్రైవేటు కంపెనీలు ఇందులో హాజరుకానున్నాయి. ఈ మేళా ద్వారా దాదాపు 3 వేలకు పైగా ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

విద్యార్హతలు

ఆసక్తి గల అభ్యర్థులు 10వ తరగతి (SSC), ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (P.G), డిప్లొమా, హోటల్‌మేనేజ్‌మెంట్, ఎంబీఏ, ఎంసిఎ, ఎంసిఎస్, బీఫార్మా, ఎంఫార్మా, బఇ, బిటెక్, ఎం.టెక్, బిఎ, బి.ఎస్సీ, బికామ్ తదితర అన్ని రకాల విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులు.

ఇందులో ట్రాన్స్‌జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించారు. 

దరఖాస్తు విధానం

జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తమ బయోడేటా జిరాక్స్, విద్యార్హత డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. ఈ మేళాలో ప్రతి అభ్యర్థి కనీసం 5 కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉంది. అందువల్ల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తమకు నచ్చిన రంగంలో ఉద్యోగాన్ని పొందాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.

Advertisment
తాజా కథనాలు