BIG BREAKING: ప్రభుత్వం కూలుతుంది జాగ్రత్త.. రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సంచలన వార్నింగ్-VIDEO
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. కేవలం 50 వేల నియామకాలు చేపట్టిందన్నారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. కేవలం 50 వేల నియామకాలు చేపట్టిందన్నారు. నిరుద్యోగులకు ఓ అన్నలాగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. నేపాల్ లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ మనుగడ సాధించలేదన్నారు. ఈ రోజు సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వచ్చి మాకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారు.. కానీ అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… pic.twitter.com/dEd0Oiw8Ae
గత ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు కూడా ఓపెన్ గానే అనేక సార్లు వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ విస్తరణలోనూ ఆయనకు మంత్రి పదవి రాలేదు. దీంతో ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడి పెంచారు.
పదవులు మీకే.. పైసలు మీకేనా?
రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రేవంత్ రెడ్డి మనకు పదవులు ఇస్తలేడు మన కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేడు
నాకు మంత్రి పదవి ఎట్ల రావాలో అట్ల వస్తది, ఎవ్వడూ ఆపలేడు
మరో పదేళ్లు తానే సీఎం అంటూ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ అని.. అలా కుదరదంటూ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని కూడా ఆయన మండిపడ్డారు. పదవులు మీకే.. పైసలు కూడా మీకేనా అంటూ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు ఇస్తే తప్పేంటని కూడా ఆయన ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సైతం ఆయన నిత్యం భేటీ అవుతున్నారు. అండగా ఉంటానంటూ భరోసానిస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడం ఖాయమన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.