/rtv/media/media_files/2026/01/26/fotojet-9-2026-01-26-15-47-18.jpg)
TET candidates Normalization
TG TET 2026: తెలంగాణలో ఉపాధ్యాయుల నియమకానికి సంబంధించి ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఫలితాల్లో ‘నార్మలైజేషన్’ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. ఒక జిల్లాకు ఒకే సెషన్‌లో పరీక్ష పెట్టినందున ఇబ్బందులు ఉండవని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో నార్మలైజేషన్ ఉంటుందని కొంత ప్రచారం జరిగింది. అయితే అధికారుల తాజా నిర్ణయంతో ఆ గందరగోళానికి తెరపడినట్లయింది. నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని పేర్కొనకపోవడం, జిల్లాకు ఒకే సెషన్ చొప్పున పరీక్ష నిర్వహించడంతో నార్మలైజేషన్ అవసరం లేదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ విధానాన్ని తెస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read : పద్మ పురస్కారాల్లో తెలుగువారి హవా.. 13 మంది అవార్డులు
TET Candidates Normalization
నిజానికి ఆన్‌లైన్ పరీక్షలు వేర్వేరు సెషన్లలో జరిగినప్పుడు.. ఒక పేపర్ కఠినంగా, మరో పేపర్ సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు ‘నార్మలైజేషన్’ చేస్తారు. అయితే, ఈసారి దాదాపు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులందరికీ ఒకే రకమైన క్వశ్చన్ పేపర్ వచ్చింది. దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగలేదని, అందుకే నార్మలైజేషన్ అవసరం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉండటం, ఒకే జిల్లా అభ్యర్థులను వేర్వేరు సెషన్లకు విభజించడంతో అక్కడ నార్మలైజేషన్ తప్పనిసరి అయ్యింది. కానీ, మన దగ్గర ఆ పరిస్థితి లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 30న టెట్ ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ‘కీ’లో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ఆదేశాలతో ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణుల కమిటీని వేశారు. ఈ కమిటీ మరోసారి ఆన్సర్లను క్షుణ్నంగా చెక్ చేశాకే ‘కీ’ని విడుదల చేయాలని భావిస్తున్నారు. - tg-tet-notification
Also Read : నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఆరుగురు.. రంగంలోకి దిగిన రోబో ఫైర్ మిషన్
Follow Us