Engineering: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రభుత్వం రైతుభరోసాను అమలు చేయనుంది. దీనితో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో కూడా వేగం పెంచాలని అధికారులను ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కాగా దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియమకాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం నలుగురి పేర్లను మాత్రమే ప్రకటించగా మరో ముగ్గురికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నూతన సీఎస్ నియామకాన్ని చేపట్టింది.
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కశ్మీర్ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపు కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు తక్కువ వ్యయంతో తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందారు.
రంజాన్ పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు ప్రకటించింది. మార్చ్ 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది.