Miss World 2025 : మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కాగా దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

New Update
Miss World 2025

Miss World 2025

 Miss World 2025 : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోటీలపై తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్‌,  ఐపీఎస్‌ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. కాగా కమిటీ సభ్యులు ముగ్గురు కూడా పోటీల్లో పాల్గొంటున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లను పర్సనల్ గా కలిసి ఎంక్వరీ చేస్తున్నారు. పోటీలు జరుగుతున్న తీరుతో పాటు ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరినుండైనా సమస్య ఎదురవుతుందా? అని అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో నిజమెంత అనే విషయంలోనూ వివరాలు రాబడుతున్నారు. 

Also Read: పహల్గాం బాధిత మహిళల్లో ఆ లక్షణాలు లేవు.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

కాగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లను విచారిస్తున్న సమయంలో ప్రత్యేకంగా వీడియోలు సైతం రికార్డు చేస్తున్నారు. దేశప్రతిష్ట, పరువు, రాష్ర్ట భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై విచారణ సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. కంటెస్టెంట్‌లతోపాటు.. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆక  మిల్లా మాగీ ఆరోపిస్తున్న రోజు ఆమె పాల్గొన్న డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆరోజు ఆమెతో కూర్చున్నవార ఎవరు? వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

 కాగా మిల్లా మాగీ మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా’ అంటూ అరోపించింది. తనను ఇబ్బంది పెట్టారంటూ మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణపై గౌరవం పెరిగిందని, అతిథ్యం బాగుందని మెచ్చుకుంటూనే మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలని ప్రశ్నించారు. ప్రపంచ సుందరి-2025 పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఆమె ఇంగ్లాండ్‌ వెళ్లిన తర్వాత చేసిన ఆ వ్యాఖ్యల్ని బ్రిటిష్‌ మీడియా ప్రచురించింది. ఈ కథనాలను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లే ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సైతం తోసిపుచ్చారు. అయినా ప్రభుత్వం, నిర్వహకులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

Also Read : అలా చేస్తేనే పార్టీలో ఉంటా.. కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్లు ఇవే!

Advertisment
తాజా కథనాలు