/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నూతన సీఎస్ నియామకాన్ని చేపట్టింది. మే 1 న ఆయన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వ హాయంలో 2023 జనవరి 11న శాంతి కుమారి సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సైతం ఆమెను కొనసాగించింది. తాజాగా ఆమె పదవీ కాలం ముగియడంతో కొత్త సీఎస్ నియామకాన్ని చేపట్టింది రేవంత్ సర్కార్. శాంతికుమారిని ఆర్టీఐ కమిషనర్ గా నియమిస్తారన్న ప్రచారం సాగుతోంది.
Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్
Telangana News CS
తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ(సీఎస్)గా కే రామకృష్ణారావు (IAS) నియామకం
— LATEST NEWS TO DAY (@VRajeshekar) April 27, 2025
మే 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్న కే రామకృష్ణారావు pic.twitter.com/Wuq7829itz
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
(telangana government news | telugu-news | telugu breaking news)