ఎమర్జెన్సీ విధించిన వారి పేరుతో రూ.5 భోజనమా.. రఘనందన్ రావు ఫైర్

రాష్ట్రంలో అమలు అవుతున్న అన్నపూర్ణ క్యాంటీన్‌ రూ.5 భోజనానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధించిన వారి పేరు అన్నపూర్ణ క్యాంటీన్‌‌కు పెడతారా అని ఎద్దేవా చేశారు.

New Update
Raghunandan Rao

రాష్ట్రంలో అమలు అవుతున్న అన్నపూర్ణ క్యాంటీన్‌ రూ.5 భోజనానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధించిన వారి పేరు అన్నపూర్ణ క్యాంటీన్‌‌కు పెడతారా అని ఎద్దేవా చేశారు. అంత అర్జెంట్‌గా పథకానికి పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేయర్ ప్రజల నిత్యావసరాలు, సౌకర్యాల గురించి మాట్లాడితే బాగుండని మెదక్ ఎంపీ సూచించారు. పేరు మార్పుతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఏం జరుగుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. దానిపై ముందుగా కంప్లీట్ చేసిందే ఆయనని తెలిపారు. విచారణకు ఎంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు