Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏపీకి 48 స్పెషల్ ట్రైన్స్ - ఈ నెల నుంచే స్టార్ట్
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి SCR కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9 నుండి సెప్టెంబర్ 25 వరకు మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ముఖ్యంగా తిరుపతి, కాచిగూడ, నరసాపూర్, హిస్సార్, తిరువణ్ణామలై వంటి మార్గాల్లో అందుబాటులో ఉంటాయి.