/rtv/media/media_files/2025/11/07/trains-2025-11-07-07-37-50.jpg)
శబరిమల యాత్రికుల(sabarimala-devotees) రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్ల(special-trains)ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కేరళలోని ముఖ్యమైన శబరిమల సమీప స్టేషన్ల వరకు నడుపుతుంది. నేటి నుంచి ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలను రైల్వే వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
SCR to run 60 #Sabarimala#SpecialTrains
— South Central Railway (@SCRailwayIndia) November 6, 2025
Bookings for the Sabarimala Special Trains will be open tomorrow morning i.e., 07/11/2025 @ 08.00 hrs pic.twitter.com/U1xbjxkRPa
Also Read : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల్లోనే..!
హైదరాబాదు ప్రాంతం నుండి కొల్లాం (శబరిమలకు దగ్గరగా ఉండే స్టేషన్లలో ఒకటి) వరకు ఈ రైళ్లు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు సాధారణంగా నవంబర్ నెల చివరి వారం నుండి మొదలై, జనవరి నెల మొదటి లేదా రెండవ వారం వరకు (మండల పూజ, మకర జ్యోతి పండుగల సమయాన్ని కవర్ చేస్తూ) నడుపుతారు. 2026 జనవరి వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.
భక్తులు ఎక్కువగా ఉండే
యాత్రికుల సౌలభ్యం కోసం ఈ రైళ్లు ప్రధానంగా భక్తులు ఎక్కువగా ఉండే తెలంగాణలోని కాజీపేట, వరంగల్.. ఆంధ్రప్రదేశ్‌లోవిజయవాడ, గూడూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కడప స్టేషన్లలో ఆగుతాయి. రద్దీ ఎక్కువగా ఉండే సీజన్ కాబట్టి, ప్రయాణానికి ముందుగానే రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం మంచిది. రైళ్ల సమయాలు, నంబర్లు, ఏ రోజు నడుస్తాయి అనే పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా రైల్వే విచారణ కేంద్రాలలో తనిఖీ చేయాలి.
Also Read : మందుబాబులకు బిగ్ షాక్.. 4 రోజులు వైన్ షాపులు బంద్
Follow Us