/rtv/media/media_files/2025/03/08/bxs9vSiKeXmHfhOgJFZZ.jpg)
South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal
హైదరాబాద్ నగరంలో ప్రధానమైన రైల్వేస్టేషన్లుగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషనల్‌లో ఎప్పుడు చూసినా రద్దీ భారీ స్థాయిలో ఉంటుంది. కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఇటీవల చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించారు.
ఇది హైదరాబాద్‌లోనే అతి పెద్ద రైల్వే టెర్మినల్‌గా ఉంది. దీనిని దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ స్టేషన్ నుంచి పలు ప్రాంతాలకు ట్రైన్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
ఇందులో భాగంగా మరో రెండు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. అయితే అవి కొత్తవి కావు. హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభ స్థానం చర్లపల్లికి మారింది. ఈ విషయన్ని రైల్వేశాఖ తెలిపింది.
ఏ ఏ రైళ్లు అంటే?
ఈ మేరకు నాంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరే చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ( 12603)ను చెన్నైసెంట్రల్-చర్లపల్లిగా మార్చారు. మార్చి 7 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తెలిపారు.
హైదరాబాద్- చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ( 12604) చర్లపల్లి- చెన్నై సెంట్రల్‌గా మార్చారు. ఇది నేటి నుంచి (మార్చి 8) నుంచి అమల్లోకి వస్తుంది.
Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
అలాగే గోరఖ్‌పుర్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్- గోరఖ్‌పుర్ ( 12589, 12590) గోరఖ్‌పుర్-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మార్చి 12, 13 తేదీల నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఇకపై ఈ రెండు ట్రైన్లు సికింద్రాబాద్, నాంపల్లి నుంచి కాకుండా చర్లపల్లి నుంచే ప్రారంభం అవుతాయని.. ఈ విషయాన్ని ట్రైన్ ప్రయాణికులు గమనించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ తెలిపారు.
ఇది మాత్రమే కాకుండా రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి దానాపూర్, ముజఫర్‌పూర్, కాకినాడ, నర్సాపూర్‌లకు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.