/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
Special Trains
సాధారణ రోజులతో పోలిస్తే వీకెండ్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి నుంచి ఏపీలో కాకినాడ టౌన్, నర్సాపూర్‌కు వీకెండ్‌లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. మొత్తం 20 ప్రత్యేక రైళ్లను వేశారు. మొదటి రైలును ఈ నెల 28వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
Special Trains between Charlapalli – Kakinada Town & Charlapalli - Narsapur during Weekends @drmsecunderabad @drmvijayawada @drmgnt pic.twitter.com/bL0esis8rU
— South Central Railway (@SCRailwayIndia) February 26, 2025
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
రైళ్ల లిస్ట్ ఇదే..
ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) సాయంత్రం 7:20 నిమిషాలకు చర్లపల్లి నుంచి రైలు (07031) ప్రత్యేక బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) సాయంత్రం 6:55 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి రైలు (07032) బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 6:50 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా వెళ్తుంది.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) రాత్రి 8:15 నిమిషాలకు చర్లపల్లి నుంచి రైలు (07233 ) బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 5:50 నిమిషాలకు నర్సాపూర్‌కు చేరుకుంటుంది.
మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుంచి రైలు ( 07234) బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.