Special Trains: తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి - సాయినగర్‌ శిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Special Trains

Special Trains

Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  తిరుపతి - సాయినగర్‌ శిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య వచ్చే రెండు నెలలు18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ 29వరకు సేవలందిస్తాయని తెలిపింది. 

Also Read:ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

రైళ్ల వివరాలు.. 

తిరుపతి - సాయినగర్‌ శిర్డీ రైలు (07637) ప్రతి ఆదివారం తిరుపతిలో ఉదయాన్నే 4గంటలకు బయల్దేరి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10.45 గంటలకు శిర్డీకి చేరుకుంటుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ 28వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది. అలాగే, శిర్డీ- తిరుపతి రైలు (07638) సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (తెల్లవారితే బుధవారం) తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4నుంచి సెప్టెంబర్‌ 29వరకు కొనసాగుతాయి. ఈ రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఎసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఆగనున్న స్టేషన్లు

తిరుపతి, శిర్డీ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, జహీరాబాద్‌, బీదర్‌, భాల్కి, ఉద్గిర్‌, లాతూర్‌ రోడ్డు, పర్లి, గంగఖేర్‌, పర్భని, సేలు, జాల్నా, ఔరంగాబాద్‌, నాగర్‌సోల్‌, మన్మాడ్‌, కోపర్‌గావ్‌ స్టేషన్లలో ఆగుతాయి.  

Also Read:పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు