/rtv/media/media_files/2025/05/15/cZyL6yFbPlRt7eGGvaR1.jpg)
Summer Special Trains
సమ్మర్ హాలీడేస్‌లో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తారు. దీని కోసం ఎక్కువగా ట్రైన్ జర్నీ చేస్తారు. అలాంటి సమయంలో రైళ్లు విపరీతమైన రద్దీతో ఉంటాయి. దీంతో ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!
AP-TG మధ్య స్పెషల్ ట్రైన్స్
చర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మే 17, 18 తేదీల్లో ఈ స్పెషల్ రైళ్లను నడపనున్నారు. చర్లపల్లి - విశాఖపట్నం (ట్రైన్ నం.07441) ప్రత్యేక రైలు మే 17న మధ్యాహ్నం 2 గం.కు బయలుదేరుతుంది. అది మరుసటి రోజు ఉదయం 03.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
అలాగే విశాఖపట్నం-చర్లపల్లి (ట్రైన్ నం.07442) స్పెషల్ ట్రైన్ మే 18న రాత్రి 11.00 విశాఖలో బయలుదేరుతుంది. అది మరుసటి రోజు ఉదయం 11.40 చర్లపల్లి చేరుకుంటుంది.
Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్
ఈ స్పెషల్ ట్రైన్స్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్ల మీదుగా ఇరువైపులా నడుస్తాయి. ఈ స్పెషల్ ట్రైన్‌లో కేవలం 3ఏసీ, 3ఏసీ(ఎకానమీ) క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
Also Read : హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
మరోవైపు భారతీయ రైల్వే త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లను ప్రారంభించనుంది. తొలి దశలో 9 రైళ్లు ప్రవేశపెట్టబోతుంది. అందులో 2 రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించనుంది. ఈ రెండు రైళ్లు ఏపీ, తెలంగాణలో వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి.
Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!
special-trains | summer-special-trains | latest-telugu-news | telugu-news
Follow Us