South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!

హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. ఈ రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

trains

మరికొద్ది రోజుల్లో వేసవి సెలవుల ప్రారంభం కావడంతో... వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే  ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుండి తిరుమల వెళ్లే స్వామివారి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Also Read:BIG BREAKING: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!

ఈ క్రమంలోనే తిరుమల స్వామి వారిని  దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. హైదరాబాద్ నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. వారి సౌకర్యార్థం.. దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు మే 23వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్

Tirumala Special Trains

రైలు నెంబర్ 07017 చర్లపల్లి నుండి ప్రతి శుక్రవారం, ఆదివారం రాత్రి 10:35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెంబర్ 07018 తిరుపతి నుండి ప్రతి శనివారం , సోమవారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

చర్లపల్లి - తిరుపతి ఏప్రిల్ 11, 13, 18, 20,   మే 4, 9 తేదీలలో రాత్రి 10:35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ సర్వీస్ ఏప్రిల్ 6వ తేదీన కూడా కల్పించారు. ఇక తిరుపతి - చర్లపల్లి ఏప్రిల్ 12, 14, 19, 21, 26, 28.. మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి ఉదయం 7:10 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికులకు ఏప్రిల్ 7వ తేదీన కల్పించారు. మొత్తం 32 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది.

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపతి రోడ్, గదవాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

 

latest telugu news updates | latest-telugu-news | telugu-news | special-trains | south-central-railways | south-central-railway | secundrabad | tirupati | today-news-in-telugu | andhra-pradesh-news | latest telangana news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు