Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెంచింది.