/rtv/media/media_files/2025/08/25/salary-2025-08-25-17-12-48.jpg)
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఐదు రోజుల ముందే అకౌంట్లోకి జీతాలు, పెన్షన్లు వేయనుంది. 2025 ఆగస్టు 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ జారీ చేసిన మెమోరాండం ప్రకారం, మహారాష్ట్రలోని రక్షణ, పోస్ట్, టెలికాం సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతం ఆగస్టు 26 మంగళవారం రోజున పడనుంది. అంటే, వారి జీతాలు ఆగస్టు 27న వినాయక చవితికి ముందు వారి బ్యాంకులోకి జమకానున్నాయి. అదేవిధంగా, కేరళలో ఓనం పండుగ సెప్టెంబర్ 5 వరకు జరుపుకుంటారు, కాబట్టి వారి జీతం కూడా ఆగస్టు 25 సోమవారం రోజున పడిపోతుంది.
ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే ఉద్యోగులు పండుగల సమయంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూడదని, వారు తమ కుటుంబాలతో కలిసి పండుగను బాగా జరుపుకోవాలిని భావించింది. ఈ చెల్లింపులను ముందస్తు చెల్లింపులుగా పరిగణిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోని బ్యాంకుల శాఖలు జీతాలు, పెన్షన్లను ముందస్తుగా చెల్లించే కార్యక్రమాన్ని ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని ఆదేశించాలని మంత్రిత్వ శాఖ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI)ని అభ్యర్థించింది.
మహారాష్ట్రలో గణేశోత్సవ్
మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ అత్యంత వైభవంగా, పది రోజుల పాటు జరుపుకునే ఒక ప్రధాన పండుగ. దీనిని గణేశోత్సవ్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ మహారాష్ట్ర సంస్కృతికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగను ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో ఐక్యతను పెంపొందించడానికి మొదలుపెట్టారని చెబుతారు. తర్వాత, బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను ప్రజలందరినీ ఏకం చేయడానికి, స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ప్రేరేపించడానికి ఒక ప్రజా ఉత్సవంగా మార్చారు. ప్రజలు తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాలలో పెద్ద పెద్ద పందిళ్ళలో (మండపాలు) గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ విగ్రహాలు మట్టితో తయారు చేయబడతాయి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణే, రత్నగిరి, పాలి వంటి నగరాలలో గణేష్ చతుర్థి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.