Tcs Layoffs: టీసీఎస్‌లో భారీగా లేఆఫ్‌లు.. ఆ ఉద్యోగులకు రెండేళ్ల జీతం ఇచ్చి తొలగింపు!

ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇటీవల 80 వేల మందికి పైగా ఉద్యోగులకు తీసి వేసిన విషయం తెలిసిందే. అయితే నైపుణ్యాలు లేని, కంపెనీకి వారి ఉపయోగం లేని వారిని తీసేసింది. కొందరు కొన్నేళ్ల నుంచి కంపెనీలో ఉంటే వారికి రెండేళ్ల జీతం ఇచ్చి మరి తొలగిస్తున్నారు.

New Update
TCS

TCS

ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇటీవల 80 వేల మందికి పైగా ఉద్యోగులకు తీసి వేసిన విషయం తెలిసిందే. అయితే నైపుణ్యాలు లేని, కంపెనీకి వారి ఉపయోగం లేని వారిని తీసేసింది. కొందరు కొన్నేళ్ల నుంచి కంపెనీలో ఉంటే వారికి రెండేళ్ల జీతం ఇచ్చి మరి తొలగిస్తున్నారు. కొందరికి ఎలాంటి నైపుణ్యాలు లేకపోవడం, క్లయింట్ అవసరాలను పూర్తిగా తీర్చలేని వారిని టీసీఎస్ తొలగిస్తోంది. కొందరిని వెంటనే తొలగించగా.. మరికొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇచ్చి మరి తీసేస్తుంది. అయితే దీంతో పాటు కొందరికి ఆరు నెలల నుంచి 2 ఏళ్ల వరకు కూడా పరిహారం కింద జీతం ఇస్తోంది.

ఇది కూడా చూడండి: Tech Layoffs: ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!

రెండేళ్ల జీతం ఇస్తూ..

అలాగే 8 నెలలకు మించి బెంచ్‌పై ఉన్నవారికి సింప్లర్ ప్యాకేజీ మాత్రమే ఇస్తారు. అంటే నోటీసు పీరియడ్‌లో ఉన్న వేతనాన్ని మాత్రమే ఇస్తారు. కంపెనీలో 10 నుంచి 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి ఏడాదిన్నర జీతాన్ని పరిహారంగా ఇస్తారు. అదే 15 ఏళ్ల కంటే ఎక్కువగా ఉద్యోగం చేస్తే 2 ఏళ్ల జీతం ఇస్తారు. వీటితో పాటు ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలు కూడా లభిస్తాయి. అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి టీసీఎస్ కేర్స్ ప్రోగ్రామ్ కింద చికిత్స అందిస్తారు. అలాగే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన వారికి టీసీఎస్ ముందస్తు పదవీ విరమణకు కూడా అవకాశం ఇస్తోంది. వీరికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు వేతనాన్ని పరిహారంగా చెల్లిస్తోంది. 

ఇది కూడా చూడండి: AP Inter 2026 Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఎప్పట్నుంచంటే?

Advertisment
తాజా కథనాలు