Madhya Pradesh : మాములు పోలీస్ కాదయ్యా.. ఒక్కరోజు డ్యూటీకి వెళ్లకుండా రూ. 28 లక్షల జీతం తీసుకున్నాడు!

మధ్యప్రదేశ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్నాడో కానిస్టేబుల్. ఈ కేసు 2011లో మధ్యప్రదేశ్ పోలీసులలో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారిది.

New Update
mp police

మధ్యప్రదేశ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్ ఈ కేసుకు సంబంధించినది. ఈ కేసు 2011లో మధ్యప్రదేశ్ పోలీసులలో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారిది.

ఆ కానిస్టేబుల్ 2011లో మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలోకి నియమితులయ్యారు. మొదట భోపాల్ పోలీస్ లైన్స్‌లో నియమించబడ్డారు.  చేరిన కొద్దికాలానికే అతని బ్యాచ్‌ను సాగర్ పోలీస్ శిక్షణ కేంద్రానికి ట్రైనింగ్ పంపించారు. కానీ అక్కడ అతను  రిపోర్ట్ చేయకుండా విదిషలోని తన ఇంటికి వెళ్లిపోయాడు.  అతను ఏ అధికారికి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా సెలవు కోసం దరఖాస్తు చేసుకోలేదు.  కానీ తన సర్వీస్ ఫైల్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్‌కు పంపాడు. ఆ ఫైల్ అక్కడికి చేరుకుంది. ఎటువంటి దర్యాప్తు లేకుండానే ఆమోదించబడింది.  

భోపాల్ పోలీస్ లైన్‌లో ఎవరూ అతని గైర్హాజరీని పట్టించుకోలేదు. ఈ విధంగా అతను విధులకు హాజరు కాకుండానే  ఏడాది తర్వాత ఏడాది ఇలా 12 ఏళ్లుగా  జీతం పొందుతూనే ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 12 ఏళ్లుగా ఏ అధికారి కూడా ఈ అక్రమాన్ని గుర్తించలేకపోయారు.  

మానసిక ఆరోగ్య సమస్యలతో

అయితే 2011 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్ల పదోన్నతి జరుగుతున్నప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కానిస్టేబుల్ ను ఉన్నాతాధికారులు విచారణకు పిలువగా..తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అందువల్ల విధులకు హాజరు కాలేదన్నాడు. కొన్ని రిపోర్టులను కూడా అధికారులకు అందించాడు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్‌ను భోపాల్ పోలీస్ లైన్‌లో ఉంచారు. అతని నుండి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు, మిగిలిన మొత్తాన్ని అతని రాబోయే జీతం నుండి కట్ చేస్తామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన ఏ అధికారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ వెల్లడించింది.  

Also read :  Supreme Court: మాజీ CJI చంద్రచూడ్‌కి బిగ్ షాక్.. కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు