/rtv/media/media_files/2025/08/24/10-30-50-rule-2025-08-24-13-51-51.jpg)
10-30-50 Rule (Google gemini Image)
ఎంత సంపాదించామన్నది కంటే.. పొదుపు(Savings Rule) ఎంత చేశామన్నదే ముఖ్యం. పది రూపాయలు సంపాదించినా అందులో కనీసం ఒక రూపాయి అయినా కూడా సేవ్ చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో యువత సంపాదన కంటే ఎక్కువగా ఖర్చులు పెడుతోంది. దీంతో వారు సంపాదించిన దాని కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా పొదుపు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ నెల మీకు వచ్చే జీతంలో కొంత పొదుపు చేస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 10-30-50 రూల్ పాటిస్తే ఈజీగా మనీ సేవ్ అవుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ రూల్ ఏంటి? పాటించడం ఎలా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి:Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. ఎన్నడూ లేనంత బోనస్!
10%
మీరు ప్రతి నెలా సంపాదించే ఆదాయంలో 10% భాగాన్ని కేవలం పొదుపు లేదా పెట్టుబడుల కోసం ఉపయోగించాలి. ఈ డబ్బును వైద్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగించాలి. దీనివల్ల మీకు అకస్మాత్తుగా డబ్బులు కావాలంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ 10 శాతం డబ్బులను ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్(Mutal Funds) లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits) వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో డబ్బు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
30%
మీ ఆదాయంలో 30% భాగాన్ని మీరు కోరుకునే సౌకర్యాలు, ఆనందాల కోసం ఖర్చు చేయండి. సినిమాలు చూడడం, పార్టీలకు వెళ్లడం, విహారయాత్రలకు వెళ్లడం, కొత్త బట్టలు, గాడ్జెట్లు లేదా ఇతర వస్తువులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, జిమ్ వంటి వాటి ఖర్చులకు ఉపయోగించాలి. ఎంత ఖర్చు పెట్టినా కూడా 30 శాతం సేవ్ చేసిన దాని కంటే ఎక్కువగా చేయకూడదు. కాస్త ఎక్కువ అయితే మాత్రం మీకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
50%
మీ ఆదాయంలో 50% భాగాన్ని తప్పనిసరి అయిన అవసరాల కోసం ఖర్చు చేయాలి. మీరు నివసించే ఇంటి అద్దె లేదా ఇంటి రుణం కోసం, ఇంటి కోసం కొనుగోలు చేసే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ లేదా ప్రజా రవాణా ఖర్చులు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి వాటి కోసం ఖర్చు చేయాలి. దీనివల్ల మీరు సంపాదన కంటే ఎక్కువగా ఖర్చు చేయరు. అయితే మీరు ఈ రూల్‌ను మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీరు త్వరగా ఒక పెద్ద మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే, కోరికల కోసం ఖర్చు చేసే శాతాన్ని తగ్గించి, పొదుపు శాతాన్ని పెంచుకోవచ్చు. దీనిని 20-30-50 లేదా 15-25-60 రూల్‌గా కూడా మార్చుకోవచ్చు.
ఇది కూడా చూడండి:Stock Market: ఊపుమీదున్న బజాజ్, రిలయెన్స్ షేర్లు..వరుసగా నాలుగో రోజులు లాభాల్లో మార్కెట్
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.