Municipality Corporation : మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, వైస్ ఛైర్మన్ల జీతం ఎంతో తెలుసా?

రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఒకటిరెండు మినహా అన్ని పురపాలికలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. కాగా ఎంపికైన మేయర్, డిప్యూటీ మేయర్ ,చైర్మన్, వైస్ చైర్మన్ లకు వేతనాలుంటాయి.

New Update
FotoJet (12)

Municipality Corporation

రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌(muncipal corporation), మున్సిపాలిటీలకు ఎన్నికలు(Muncipal Election) పూర్తయ్యాయి. ఒకటిరెండు మినహా అన్ని పురపాలికలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి.కాగా  కొత్త మేయర్లు, ఉపమేయర్లు. ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక పూర్తి కావడంతో అయా పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకోనున్నాయి. కాగా ఎన్నికైన పాలకవర్గాలకు గౌరవ మర్యాదలతోపాటు అధికారాలు, బాధ్యతలున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు సదరు కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీలో పర్యటనల సందర్భంగా,  నగర, పట్టణ ప్రథమ పౌరులుగా ప్రొటోకాల్‌లో వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికైన తేదీ నుంచి ఐదేళ్లపాటు  కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ఉంటుంది. ఎన్నికైన మేయర్‌కు జీతాలు, వాహన భత్యాలు,. సిబ్బంది సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పురపాలక ఛైర్‌పర్సన్లకు కూడా వేతనాలుంటాయి.

Also Read :  క్యాతనపల్లిలో హైటెన్షన్‌.. బాల్క సుమన్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. వందల సంఖ్యలో కార్యకర్తల రాకతో ఉద్రిక్తత

మున్సిపాలిటీలలో..

మున్సిపాలిటీల్లో 50 వేల జనాభా దాటితే ఆ ఛైర్‌పర్సన్లకు రూ.19,500 జీతం(salary), డిప్యూటీ ఛైర్‌పర్సన్లకు రూ.9,750,  కౌన్సిలర్లకు రూ.4,550 చొప్పున జీతాలుంటాయి.
మున్సిపాలిటీల్లో 50 వేల కంటే తక్కువ జనాభా ఉంటే అక్కడి ఛైర్‌పర్సన్లకు రూ.15,600, డిప్యూటీ ఛైర్‌పర్సన్లకు రూ.6,500, కౌన్సిలర్లకు రూ.3,250 చొప్పున  జీతాలు ఇస్తారు.

కార్పొరేషన్లలో

మున్పిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌కు రూ. 65,000 వేతనం ఇస్తారు. ఇక డిప్యూటీ మేయర్​కు రూ. 32,500 , కార్పొరేటర్​కు.రూ. 7,500 వేతనం ఉంటుంది.

అవిశ్వాస తీర్మానం ...

రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్‌పర్సన్లు పదవి చేపట్టిన మొదటి 4 సంవత్సరాల వరకు వారిపై ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు.  నాలుగేళ్ల తర్వాత ఆ అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం ఓటు హక్కు ఉన్న సభ్యులలో కనీసం సగం మంది సంతకాలతో నోటీసు ఇచ్చి 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదిస్తే వారిని పదవి నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది.

Also Read :  రెండు కోట్ల బీమా కోసం దారుణం.. స్నేహితుడి చంపేందుకు కుట్ర

విధులు  : ఎంపికైన మున్సిపల్‌ పాలకవర్గం పారిశుద్ధ్య పర్యవేక్షణ మొదలు రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, మొక్కలు నాటడం, తాగునీటిని సరఫరా చేయడం, వీధిదీపాల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, పన్ను వసూలు, రుణాల చెల్లింపు తదిరత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పాలకవర్గాల సమావేశాలకు మేయర్‌ అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ మేయర్‌ అందుబాటులో లేకుంటే డిప్యూటీ మేయర్‌ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. నెలకు కనీసం ఒకసారైన సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాగా పాలకర్గాలు మొక్కల సంరక్షణలో విఫలమైతే పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సంబంధిత వార్డు సభ్యుడిని పదవి నుంచి తొలగించే అవకాశం చట్టానికి ఉంటుంది. ఇక ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, గ్రాంట్ల కింద నిధులు ఇస్తాయి. వాటితో అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలో ఐదుగురు, పురపాలికల్లో నలుగురు చొప్పున కో-ఆప్టెడ్‌ సభ్యులు ఉంటారు. వీరికి కౌన్సిల్‌ లేదా కార్పొరేషన్‌ సమావేశాలలో చర్చించే హక్కు ఉంటుంది.. కానీ వారికి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు.  

Advertisment
తాజా కథనాలు