LIC Recruitment: నెలకు లక్షకు పైగా జీతంతో ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

ల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 841 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.1,69,000 పైగా జీతం లభిస్తుంది.

New Update
LIC

LIC jobs

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి శుభవార్త. ఇందులో ఎల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 841 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 81, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులు 410, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టులు 350 ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8. అయితే ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ licindia.in లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.1,69,000 పైగా జీతం లభిస్తుంది. వివిధ పోస్టులను బట్టి ఈ జీతం ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Vikasit Bharat Rozgar Yojana scheme: మోదీ గుడ్‌న్యూస్.. ప్రైవేట్ జాబ్ వస్తే పండగే.. రూ.15వేలు ఇవ్వనున్న కేంద్రం

ఒక్కో పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు..

ఈ పోస్టులు అభ్యర్థుల వివిధ నైపుణ్యాలను, విజ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులుకి వ్యాపార, అకౌంటింగ్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై జ్ఞానం ఉండాలి. ఈ పోస్టులకు విద్యార్హత, వయోపరిమితులు వేర్వేరుగా ఉంటాయి. SC/ST/దివ్యాంగ్ అభ్యర్థులకు రూ.85 + లావాదేవీ రుసుము + జీఎస్టీ ఉంటుంది. అదే మిగతా వారికి రూ.700+ లావాదేవీ రుసుము + జీఎస్టీ ఉంటుంది. రుసుము ఆన్లైన్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుంది. అయితే LIC ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో కేవలం మెయిన్స్ పరీక్ష క్వాలిఫై కోసం మాత్రమే. ప్రిలిమ్స్ మార్కులు తుది మెరిట్‌లో చేర్చరు. మెయిన్స్‌ పరీక్షలో పొందిన మార్కులు తుది మెరిట్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరీక్షలో ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, ఆర్థిక వ్యవహారాలు, లాజికల్ అబిలిటీ జనరల్ అవేర్‌నెస్ వంటి అంశాలు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్.. ఏకంగా 93 వేల జీతం.. ఇలా అప్లై చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు