/rtv/media/media_files/2025/03/20/YPfP3VwqK1qbi4joDdnx.jpg)
VISA
హెచ్-1బీ వీసా జారీ చేసే ప్రక్రియలో కీలక మార్పులు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రతిపాదనను కూడా వైట్‌హౌస్‌కు పంపింది. అయితే ప్రతీ ఏడాది ఎన్ని హెచ్-1బీ వీసాలు ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 85,000 ఉండగా.. ఇందులో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ చేసిన వర్కర్ల కోసం రిజర్వ్ చేశారు. అయితే ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు.
ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
Loopholes in the US visa program have made it easy for foreign staffing and outsourcing firms to bring in high-skilled workers. The Trump administration promised to protect American jobs. Here's how middlemen game the system at the expense of US workers https://t.co/dRPsZ6OMPZpic.twitter.com/xoj2bfwF20
— Bloomberg Originals (@bbgoriginals) July 21, 2025
ఇది కూడా చూడండి: Tamil Nadu: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత
ఇకపై ఆ విధానం ఉండకపోవచ్చు..
ఈ ప్రాసెస్‌ను ప్రస్తుతం నిలిపివేసినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. ఎందుకంటే 2026 వార్షిక పరిమితికి కావాల్సినన్ని దరఖాస్తులు రావడమే. అయితే వచ్చే ఏడాదికి లాటరీ విధానం ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతో 2026 ఏడాదికి లాటరీ విధానం బహుశా ఉండకపోవచ్చు. ఇకపై వీసాల కోసం కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కంపెనీలో ఇంకా ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
ప్రస్తుతం హెచ్-1బీ ఉద్యోగులు తక్కువగా ఉంటారని సమాచారం. లాటరీ విధానం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ దరఖాస్తులు చేసి వీసాలను దక్కించుకుంటున్నాయి. ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రొగ్రెస్ అనే మేధోమథన సంస్థ సూచించింది. జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తేనే ఆర్థిక విలువ 88 శాతం వరకు పెరుగుతుందని వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్