/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
4 Family Members Die After Being Hit By Car In Madurai, Tamilnadu
తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం.. కొడుకుని పార్టీ నుంచి బహిష్కణ
క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మధురై పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ చెప్పారు.
Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు
అయితే ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు మరణించడంతో వాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే రోడ్డు దాటేటప్పుడు వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఢీకోని చనిపోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయి. అందుకే రోడ్డు దాటేటప్పుడు అత్యంత జాగ్రత్తతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
telugu-news | rtv-news | road-accident | tamil-nadu