/rtv/media/media_files/2025/05/24/Dg17t1XgcPXNolPc6gVo.jpg)
Accident
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న అయిదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. రాయచోటి నుంచి కడపకు కారులో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Also Read: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
ఇదిలాఉండగా.. ప్రకాశం జిల్లాలో కూడా శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలైయ్యారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్
ఇక తమిళనాడులో కూడా విషాదం జరిగింది. పళని సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన ఒక్కసారిగా కూలిపోవడం, బస్సు అదుపు తప్పే ప్రమాదం ఉండగా వెంటనే స్పందించిన కండక్టర్ అప్రమత్తతతో అందరి ప్రాణాలను రక్షించాడు. బస్సు ప్రయాణంలో ఉండగానే డ్రైవర్ అనుకోకుండా హార్ట్ ఎటాక్‌కు గురై స్పాట్‌లోనే మరణించాడు.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
road-accident | crime | accident | rtv-news