కూలిన మూడంతస్తుల భవనం.. స్పాట్లో 20 మంది..
రాజస్థాన్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కోటాలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కోటాలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఓ హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ శ్రీగంగానగర్‌లో ఆశిష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తర్వాత అతని భార్య పక్కా ప్లానింగ్‌తో హత్య చేసినట్లు తేలింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలోనే ఈ హత్య కూడా జరగడం సంచలనం సృష్టిస్తోంది.
గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హర్సౌర్ గ్రామంలోని ఒక పొలంపై దాడి చేసి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మెడికల్ సీటు సాధించాలనే పిచ్చి ఓ యువకుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డాక్టర్ కావాలనే కోరిక కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సింది పోయి, అడ్డదారిలో సీటు సంపాదించాలనుకున్నాడు. ఏకంగా తన కాలునే నరుక్కున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
సినిమా స్క్రిప్ట్‌ను తలదన్నే రేంజ్లో రాజస్థాన్‌లో త్వరలో ఒక వింత వివాహం జరగబోతోంది. జైలు గోడల మధ్య ఇద్దరు నేరస్థుల మధ్య చిగురించిన ఓ ప్రేమకథ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది.
బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో రాజస్థాన్ లో కారులో పేలుడు పదార్థాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. కారులో తరలిస్తున్న 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు కాట్రిజ్‌లు, ఫ్యూజ్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్‌లో ఓ ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగడం దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంపెనీ CEO జితేశ్ సిసోదియా సహా ముగ్గురిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.