Jodhpur Sisters Death : మరికొన్ని గంటల్లో అక్కాచెల్లెళ్ల పెళ్లి.. కానీ, అంతలోనే ఏం చేశారంటే?

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరూ పెళ్లికి కొద్ది గంటల ముందే ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది.

New Update
FotoJet (38)

Jodhpur Sisters Death

రాజస్థాన్‌(rajasthan) లోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా ఆత్మహత్య(Jodhpur Sisters Death) కు పాల్పడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పెళ్లి(marriges) కి కొద్ది గంటల ముందే ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అక్కచెల్లెళ్లైన వధువులు శోభ (25), విమల (23) ఇద్దరూ ప్రైవేట్ స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్నారు. వచ్చిన డబ్బులతో తమ కుటుంబానికి అండగా ఉండేవారు. కాగా శనివారం (ఫిబ్రవరి 21) వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది.

Also Read :  ఒడిశాలో దారుణం.. విద్యార్థినిపై ఐదుగురు టీచర్ల అత్యాచారం

Jodhpur Sisters Death

జోధ్‌పుర్‌లోని మనై గ్రామానికి చెందిన శోభ, విమలల పెళ్లి శనివారం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అందులో వధువులిద్దరూ సంతోషంగా పాల్గొన్నారు. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. అయితే , శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు, కానీ, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరి మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్  అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

“మరో ఐదు నిమిషాలు ఆలస్యమైతే పోలీసులు వచ్చేలోపే అంత్యక్రియలు పూర్తి చేసేవారు” అని జస్వంత్‌ సింగ్‌ పేర్కొన్నారు. యువతుల మృతదేహాలు నీలి రంగులోకి మారాయని, ఇది విష ప్రయోగం వల్ల జరిగిన హత్యేనని ఆయన ఆరోపించారు.బాధితుల తండ్రి సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని జస్వంత్ సింగ్ ఆరోపిస్తున్నారు. మొదట వారికి కుదిరిన వారికి నచ్చిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లి నిశ్చయించారని, అయితే అది వారికి ఇష్టం లేదని ఆయన తెలిపారు. ఆ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడ్డారని మేనమామ ఆరోపించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పురుగుల మందు తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.  అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. - Sisters suicide

Also Read :  జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు.. మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

Advertisment
తాజా కథనాలు