/rtv/media/media_files/2026/01/23/love-marriage-2026-01-23-14-52-58.jpg)
సినిమా స్క్రిప్ట్‌ను తలదన్నే రేంజ్‌లో రాజస్థాన్(rajasthan)లో త్వరలో ఒక వింత వివాహం(marriage) జరగబోతోంది. జైలు గోడల మధ్య ఇద్దరు నేరస్థుల మధ్య చిగురించిన ఓ ప్రేమకథ(Love In Jail) ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. ఒకరు డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని చంపిన కిల్లర్ మోడల్ అయితే, మరొకరు ఏకంగా ఐదుగురిని కసాయిగా నరికి చంపిన వ్యక్తి. వీరిద్దరి పెళ్లి కోసం రాజస్థాన్ హైకోర్టు 15 రోజుల ఎమర్జెన్సీ పరోల్ మంజూరు చేయడంతో, నేడు అల్వార్‌లోని బరోడమేవ్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరగనుంది.
ఈ కథలో వధువు పేరు ప్రియ సేథ్ అలియాస్ నేహా సేథ్ ఒక మోడల్. 2018లో టిండర్ యాప్ ద్వారా దుష్యంత్ శర్మ అనే యువకుడిని ట్రాప్ చేసి, తన ప్రియుడి అప్పులు తీర్చడం కోసం అతడిని కిడ్నాప్ చేసింది. లక్షల రూపాయలు డిమాండ్ చేసి, డబ్బు అందిన తర్వాత కూడా పోలీసులకు దొరికిపోతామనే భయంతో దుష్యంత్‌ను అత్యంత దారుణంగా హతమార్చింది. డెడ్ బాడీ గుర్తు పట్టకుండా ముఖంపై కత్తితో గాట్లు పెట్టి, సూట్‌కేస్‌లో కుక్కి కొండల్లో పడేసిన కేసులో ఆమె జీవిత ఖైదు అనుభవిస్తోంది. ఆరు నెలల క్రితం జైలులో ఆమెకు హనుమాన్ ప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడగా.. అది కాస్తా పెళ్లికి దారితీసింది.
Also Read : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు... ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?
ప్రసాద్ నేర చరిత్ర మరీ భయంకరం
ఇక వరుడు పేరు హనుమాన్ ప్రసాద్ నేర చరిత్ర మరీ భయంకరం. తన ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను చంపడమే కాకుండా, ఆ హత్యను కళ్లారా చూసిన ఆమె ముగ్గురు పిల్లలను, ఒక మేనల్లుడిని కూడా ఏమాత్రం కనికరం లేకుండా నరికి చంపాడు. అప్పట్లో అల్వార్‌ను వణికించిన ఈ ఐదుగురి హత్య కేసులో అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలాంటి కరుడుగట్టిన ఇద్దరు హంతకులు జైలులో ప్రేమలో పడి, ఇప్పుడు చట్టబద్ధంగా ఒక్కటవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Follow Us