Republic Day 2026 : రిపబ్లిక్ డే ముందు పేలుళ్లకు కుట్ర.. పదివేల కిలోల పేలుడు పదార్థాలు సీజ్!

గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హర్సౌర్ గ్రామంలోని ఒక పొలంపై దాడి చేసి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
india

గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హర్సౌర్ గ్రామంలోని ఒక పొలంపై దాడి చేసి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పేలుడు సామాగ్రితో పాటుగా ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుకున్నారు. 

పక్కా సమాచారం మేరకు నాగౌర్ ఎస్పీ మృదుల్ కచ్చవా నేతృత్వంలో దాడులు నిర్వహించారు. . ఈ సోదాల్లో 187 గోనె సంచుల్లో నింపిన సుమారు 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు కనుగొన్నారు. గతంలో నవంబర్ 2025లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో సహా పలు ప్రధాన ఉగ్రదాడుల్లో ఈ అమ్మోనియం నైట్రేట్‌ను వినియోగించినట్లు అధికారులు గుర్తు చేశారు.

సులేమాన్ ఖాన్ అనే వ్యక్తి

స్వాధీనం చేసుకున్న వస్తువులలో..  9 కార్టన్ల డెటొనేటర్లు, 12 కార్టన్లు, 15 బండిళ్ల బ్లూ ఫ్యూజ్ వైర్ 12 కార్టన్లు, 5 బండిళ్ల రెడ్ ఫ్యూజ్ వైర్ లను పట్టుకున్నారు.  ఈ ఘటనకు సంబంధించి హర్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై గతంలోనే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. ప్రాథమిక విచారణలో, ఈ పేలుడు పదార్థాలను చట్టవిరుద్ధమైన మైనింగ్ కార్యకలాపాలకు సరఫరా చేస్తున్నట్లు నిందితుడు వెల్లడించారు.

ప్రస్తుతం నిందితుడిపై పేలుడు పదార్థాల చట్టం  కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏదైనా ఉగ్రకోణం ఉందా అన్న కోణంలో విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించారు. త్వరలోనే వారు నిందితుడిని ప్రశ్నించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు