Gang Rape: మహిళా మేనేజర్‌పై గ్యాంగ్‌ రేప్‌.. కంపెనీ సీఈవోతో సహా ముగ్గురి అరెస్ట్‌

రాజస్థాన్‌లో ఓ ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై గ్యాంగ్‌ రేప్ జరగడం దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంపెనీ CEO జితేశ్ సిసోదియా సహా ముగ్గురిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

New Update
CEO among three held for gang rape of woman IT firm manager in Udaipur

CEO among three held for gang rape of woman IT firm manager in Udaipur

రాజస్థాన్‌(rajasthan) లో ఓ ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై గ్యాంగ్‌ రేప్(gang-rape) జరగడం దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంపెనీ CEO జితేశ్ సిసోదియా సహా ముగ్గురిని తాజాగా  పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో కంపెనీ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్‌, తన భర్త కూడా ఉన్నట్లు చెప్పారు. తెలిపారు. దీనికి సంబంధించి విజువల్స్‌ కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు అయ్యాయని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.

Also Read: కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. ఆరేళ్లలో 172 మంది బలి

Gang Rape Of Woman IT Firm Manager In Udaipur

బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయపూర్‌లోని ఓ ప్రైవేటు ఐటీ కంపెనీ సీఈవో జితేశ్‌ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కంపెనీలో పనిచేసే వాళ్లకు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ముగిసిన తర్వాత మహిళా మేనేజర్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆ కంపెనీ మహిళా ఎగ్జి్క్యూటీవ్ హెడ్ ఆమెకు లిఫ్ట్‌ ఇస్తానని ఆఫర్ చేశారు. అదే కారులో ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌తో పాటు CEO జితేశ్ కూడా ఉన్నారు. 

Also Read: అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!

అయితే మార్గమధ్యంలో వాళ్లు ఓ దుకాణంలో సిగరెట్‌ లాంటి పదార్థాన్ని మహిళా మేనేజర్‌కు ఇచ్చారు. అది తాగిన తర్వాత ఆమ స్పృహ తప్పిపోయింది. ఆ తర్వాత సీఈవో, ఎగ్జిక్యూటివ్ హెడ్‌ భర్త తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. కాసేపటి తర్వాత ఆమెకు మెలుకువ వచ్చింది. తనను ఇంటి వద్ద దించాలని కోరింది. అయినా కూడా వారు మరుసటి రోజు ఉదయం వరకు ఆమెను కారులోనే తిప్పారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా కంపెనీ సీఈవో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.

Advertisment
తాజా కథనాలు