కూలిన మూడంతస్తుల భవనం.. స్పాట్‌లో 20 మంది..

రాజస్థాన్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కోటాలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
2 Dead and Several Injured As Under-Construction Building Collapses In Rajasthan's Kota

2 Dead and Several Injured As Under-Construction Building Collapses In Rajasthan's Kota

రాజస్థాన్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కోటాలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం కూలిన సమయంలో దాదాపు 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.

 

Also Read: చరిత్ర సృష్టించిన భారత ప్రైవేటు అంతరిక్ష సంస్థ.. స్పేస్‌లో ISS ఫొటోలు.. ఇక శత్రు దేశాలకు వణుకే

సహాయక చర్యల్లో భాగంగా భారీ యంత్రాలు వినియోగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ భవనం ఎలా కూలిపోయింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అత్యవసర పనులు కొనసాగడం వల్ల స్థానిక ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచనలు చేశారు. 

Also Read: అనిల్‌ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్‌.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు