Monsoon: కేరళకు నైరుతి రుతుపవనాలు.. ఎప్పుడంటే
భారత్‌లో మరికొన్ని రోజుల్లో వేసవి కాలం ముగియనుంది. అయితే ఈసారి అంచనాల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారత్‌లో మరికొన్ని రోజుల్లో వేసవి కాలం ముగియనుంది. అయితే ఈసారి అంచనాల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పశ్చిమగోదావరి, ఏలూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దేశ రాజధానిని మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్‌లో వర్షం పడుతోంది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.శ్రీకాకుళంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.