/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
ఏపీలో మరోసారి వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మేలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయంటున్నారు.
Also Read: Elon Musk: మస్క్...పరపతి పెరిగింది కానీ...పాపులారిటీ తగ్గింది!
Ap Weather Report - IMD
అలాగే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, కడప జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సమాచారం. విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురముండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీలు, 55 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు ఉంటాయని.. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!
మరోవైపు కర్నూలు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. కౌతాళం మండలంలోని నదిచాగిలో కురిసిన వానకు చేతికొచ్చిన పంట నీటిపాలైంది. ఒకేచోట సుమారు 2 వేల బస్తాల ధాన్యం రాశులు తడిసిపోయి పనికిరాకుండా పోయాయని రైతులు ఆందోళన పడుతున్నారు మరోసారి వర్షాలు పడతాయన్న అంచనాతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు .
మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోపలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ వానలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అటు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా వర్షానికి ధాన్యం తడిసిపోయింది.
Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!
ap | srikakulam | rains | ap-weather | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-telugu-news | latest telugu news updates