ఏపీకి 3 తుపాన్ల హెచ్చరిక | Heavy Rain Alert to Andhra Pradesh | Weather Report | Rains | RTV
మరో 24 గంటల్లో అల్పపీడనం.. 4 రోజులు నాన్‌స్టాప్ వానలు!
ఏపీలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచన!
ఏపీలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు.
Rains: తెలంగాణలో మూడు రోజులు పాటు వానలు..అలెర్ట్ ప్రకటించిన ఐఎండీ!
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
School Holidays: : భారీ వర్షాలు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి,కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లా,బాపట్ల జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన..మరో నాలుగు రోజులు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Vijayawada: విజయవాడలో మళ్లీ వాన..!
విజయవాడలో బుధవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుడమేటి వరద నిలకడగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.