Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్‌లో వర్షం పడుతోంది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. 

New Update
 Heavy rains in Telangana.

Heavy rains in Hyderabad

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్‌లో వర్షం పడుతోంది. గత కొన్ని రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడటంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

అంతేకాదు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తం రాష్ట్రంలో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.  ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలుచోట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

ఇదిలాఉండగా గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తీవ్రంగా ఎండలు నమోదు కాగా.. తాజాగా వర్షాలు పడుతున్నాయి. గత నెలలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మరోవైపు అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పంటలు నీటమునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 rtv-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు