Hyderabad: బిల్డింగ్‌ పై నుంచి కూలీన భారీ క్రేన్‌...పలు వాహనాలు ధ్వంసం!

హైదరాబాద్లో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
crane

crane

హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

Also Read: Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!

హాస్పిటల్ 4వ అంతస్తుపై పడ్డ క్రేన్.. గతంలోనే భవనాన్ని ఆరోగ్య హాస్పిటల్ మేనేజ్మెంట్  ఖాళీ చేసేసింది. 4వ అంతస్తు ఖాళీగా ఉండడం అందులో పేషెంట్ లు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్రేన్ పడడంతో 4వ అంతస్తు పాక్షికంగా ధ్వంసమైంది. గోడలు & సైడ్ వాల్ పెచ్చులూడి కింద షెడ్ పై పడటంతో కైలాష్ డయాగ్నస్టిక్ సెంటర్ ఫర్నిచర్ బాగా ధ్వంసమైంది. నార్త్‌స్టార్ నిర్మాణానికి చెందిన భారీ క్రేన్ కూలడంతో క్రేన్ ని టెక్నికల్ టీం తొలగిస్తుంది. 

Also Read: Ap Weather Report: ఏపీలో ఆ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. ఇక్కడ మాత్రం ఎండలు మండుతున్నాయ్‌ బాబోయ్‌!

క్రేన్ కూలిపోవడంతో హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో అధికారులు క్రేన్ తొలగింపు పనులు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి క్రేన్ తొలగింపు పనులు జరుగుతున్నాయి. క్రేన్ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పక్కన ఉన్న భవనాలు & వాహనాలపై క్రేన్ పడడంతో భవనంతో పాటు పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

నగరంలో ఒక్కసారి బోరున వర్షం కురిసింది. ఎస్సాఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్,  నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వాన పడింది.

ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉదయం వేళల్లో ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read:America-Indian Students: అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

Also Read: Manasa Sarovar: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

rains | collapse | crane | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు