Rain Alert : దూసుకొస్తున్న అల్పపీడనం | Heavy Rains To Hit Telugu States | Cyclone Alert | RTV
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు.
అనేక ఏండ్ల తర్వాత తొలిసారి రోహిణికార్తెలోనే వానాకాలం వచ్చేసింది.ఎండకాలం పూర్తిగా పోకముందే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పలకరించాయి. అనుకున్న సమయం కంటే 13 రోజుల ముందే నైరుతిరుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో ప్రస్తుతం మబ్బులు కమ్ముకున్నాయి. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయాన్నే వర్షం మొదలైంది. నిన్నరాత్రి నుంచి మబ్బులు కమ్ముకుని వాతవరణం చల్లబడింది. ఈరోజు ఉదయం నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది. మరికొన్ని గంటల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్లోని మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అమీర్పేట్, ఎస్సార్నగర్, యూసఫ్గూడలో వాన దంచికొడుతోంది. వర్షంకారణంగా ట్రాఫిక్కు అంతరాయం, ప్రయాణికుల తీవ్ర అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్లో మళ్లీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తు వర్షంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ECIL, కాప్రా, అల్వాల్, నాగారం, శామీర్పేట్, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం వలన రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దంచికొడుతుంది. కోఠి, దిల్షుక్నగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్లో సాధారణంగా వర్షం కురుస్తోంది.