IND vs ENG : మొదలైన వర్షం.. ఆగిపోయిన మ్యాచ్.. ఇలా అయితే ఇండియాకు కష్టమే!

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌ ఐదు రోజు ఆటకు వరణుడు బిగ్ షాకిచ్చాడు.  ఎడ్జ్‌బాస్టన్‌లో భారీగా వర్షం పడుతోంది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఒకవేళ వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉంటే మ్యాచ్ ను అంపైర్లు  డ్రాగా ప్రకటిస్తారు.

New Update
ind vs eng rain

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌ ఐదు రోజు ఆటకు వరణుడు బిగ్ షాకిచ్చాడు.  ఎడ్జ్‌బాస్టన్‌లో భారీగా వర్షం పడుతోంది. మైదానం అంతటా పెద్ద కవర్లు వేయబడ్డాయి.  దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభమవుతుంది.  ఒకవేళ వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉంటే మాత్రం మ్యాచ్ ను అంపైర్లు  డ్రాగా ప్రకటించే అవకాశం ఉంది.  ఇంగ్లండ్ ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 536 పరుగులు వెనుకబడి ఉంది.  ఇండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంటుంది.

ఇండియాకు బిగ్ షాక్

 వర్షం ఇలాగే కురిసి అంపైర్లు  మ్యాచ్ ను డ్రాగా ప్రకటిస్తే మాత్రం ఇండియాకు బిగ్ షాక్ తగిలినట్టే. ఎందుకంటే ఫస్ట్ టెస్టు మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ ను సమం చేయాలని చూస్తోంది.   శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది,  పేసర్లు ఆకాష్ దీప్ , మహమ్మద్ సిరాజ్ ఈ టెస్ట్‌లో వరుసగా ఆరు, ఏడు వికెట్లు పడగొట్టారు. భారత్ గెలిస్తే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో సమం అవుతుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు