Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుడే దంచుడు

వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 25 వరకు కురుస్తాయని తెలిపింది.

New Update
rains

heavy rains

వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 25 వరకు కురుస్తాయని తెలిపింది. ప్రజలంగా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాయుగుండం వల్ల ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Heavy Rains: ముంబయికి రెడ్ అలెర్ట్ .. 250 కి పైగా విమానాలు రద్దు?

ఏపీలో ఈ జిల్లాల్లో..

ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, తాడేపల్లిగూడెం, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, తిరుపతి, కడపలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల వారికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. 

తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాగో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. అలాగే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హన్మకొండ, జనగాం మెదక్, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అలాగే కరెంట్ వైర్లు, విద్యుత్  స్తంభాలకు కాస్త దూరంగా ఉండాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: TS ALERT : తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన

Advertisment
తాజా కథనాలు