Pakistan Army Fire In PoK: POKలో 8 మంది పాక్ పౌరులు మృతి.. బరితెగించిన పాకిస్తాన్ ఆర్మీ

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ హక్కులు, కనీస సదుపాయాల కోసం నిరసన చేపట్టిన పౌరులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరపడంతో 8 మంది నిరసనకారులు చనిపోయినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు.

New Update
8 Protesters

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK) లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ హక్కులు, కనీస సదుపాయాల కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన పౌరులపై పాకిస్థాన్ సైన్యం(pak army), భద్రతా బలగాలు కాల్పులు(firing) జరపడంతో 8 మంది నిరసనకారులు చనిపోయినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో ఆరుగురికి పైగా ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. PoKలోని ముజఫరాబాద్, కోట్లి, దాద్యాల్‌తో సహా పలు ప్రాంతాలలో 'అవామీ యాక్షన్ కమిటీ' ఆధ్వర్యంలో ప్రజలు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండటం, గోధుమపిండిపై సబ్సిడీలు తగ్గించడం వంటి అంశాలపై స్థానిక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు తీవ్రమయ్యాయి. స్థానిక శాసనసభలో కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేసిన 12 స్థానాలను రద్దు చేయాలనేది కూడా నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటి.

Also Read :  గాజాలో దారుణ పరిస్థితులు.. ఆహారం కావాలంటే మహిళలు కొరిక తీర్చాల్సిందే

Also Read :  సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడులు చేస్తున్న పాకిస్థాన్.. భయంతో వణికిపోతున్న ప్రజలు

హింస, భద్రతా చర్యలు:

నిరసనకారులు పెద్ద ఎత్తున 'షట్టర్‌డౌన్'(దుకాణాలు మూసివేత), 'వీల్ జామ్' (రవాణా నిలిపివేత) సమ్మె చేపట్టడంతో ఈ ప్రాంతంలో అల్లకల్లోలం చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ముజఫరాబాద్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు, నేరుగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా వర్గాలు, ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, పాక్ సైన్యం మద్దతుతో ముస్లిం కాన్ఫరెన్స్ గుండాలు నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో PoKలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు, దీంతో బయటి ప్రపంచానికి సమాచారం చేరడం కష్టమైంది. ఈ ఘటనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. PoK ప్రజల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు