/rtv/media/media_files/2025/05/12/RFdH9Uf2qNfLsyO37xqt.jpeg)
ప్రధాని మోదీ ఉగ్రరూపం దాల్చారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేశాకే పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధమని మోదీ అన్నారు. ఇదివరకెన్నడూలేని విధంగా పాక్‌పై కోపంతో ప్రధాని మీడియా ముందుకు వచ్చారు.
Prime Minister Narendra Modi breaks his silence, and he wasn't mincing words
— Nabila Jamal (@nabilajamal_) May 12, 2025
Firm message to Pakistan
-No talks unless it's about terror or Pakistan-occupied Kashmir
-No trade while terrorism thrives
-No illusions about peace while threat of cross-border attacks looms
India's… pic.twitter.com/l2KX6U53Nq
ఇప్పటివరకూ ఇండియా, పాక్ ఉద్రిక్తలపై క్లారిటీతో వివరణ ఇచ్చారు. భారత్‌పై యుద్ధం గెలిచామని పాకిస్తాన్‌లో సంబరాలు చేసుకున్నారు. అయితే దానిపై మోదీ స్పందించలేదు. దీంతో విపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి. వాటన్నీంటి బదులుగా ప్రధాని ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇప్పటివరకూ, ఇక ముందు పాకిస్తాన్, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ ఎలా ఉండబోనుందో మోదీ వివరించారు. పాకిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పోషించే దేశంతో వ్యాపారం చేయబోమని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమించిన భారత్ భూభాగాన్ని అప్పగింతపై మాత్రమే పాక్‌తో చర్చలు జరుపుతామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. దీంతో ఇకముందు ముందు పాకిస్తాన్ పై దాడులు జరుగుతాయని తెలుస్తోంది.
(pm modi | india pak war | latest-telugu-news | pok | ias-terrorist | isis-terror)