Pahalgam attack :పహల్గామ్ ఉగ్రదాడి పక్కా పాక్ పనే.. POKలో టెర్రరిస్ట్ అంత్యక్రియలే ఆధారాలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ తాహిర్ హబీబ్‌కు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈ చర్యతో పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపణలకు తిరుగులేని ఆధారం లభించింది.

New Update
Tahir Habib

Terrorist Tahir Habib funeral in POK

పహల్గామ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ తాహిర్ హబీబ్‌కు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈ చర్యతో పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపణలకు తిరుగులేని ఆధారం లభించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది.

టెర్రరిస్ట్ తాహిర్ హబీబ్ అలియాస్ 'అఫ్గానీ'

తాహిర్ హబీబ్ అలియాస్ 'అఫ్గానీ' అనే ఈ ఉగ్రవాదిని ఇటీవల భారత సైన్యం 'ఆపరేషన్ మహాదేవ్'లో భాగంగా మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా శ్రీనగర్‌కు సమీపంలోని మహాదేవ్ పర్వత ప్రాంతంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ముగ్గురు పాకిస్తాన్‌కు చెందినవారేనని, ముఖ్యంగా తాహిర్ హబీబ్‌కు పాకిస్తాన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.

అయితే, తాహిర్ హబీబ్ మృతదేహం లభ్యం కానప్పటికీ, పీఓకేలోని రావల్ కోట్ ఖైగలాలో అతడికి 'జనాజా ఏ గైబ్' అనే విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధానం మృతదేహం లేనప్పుడు అనుసరిస్తారు. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి పాకిస్తాన్ సైన్యాధికారులు, లష్కరే తోయిబా కమాండర్లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్ తీరు ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది.

భారత విదేశాంగ శాఖ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారిందని, ఇది ప్రపంచ శాంతికి పెను ప్రమాదమని పేర్కొంది. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ హస్తం లేదని పాక్ చేస్తున్న వాదనలు అబద్ధాలు అని నిరూపించడానికి ఈ ఘటన తిరుగులేని రుజువుగా నిలిచింది. ఈ ఘటనపై భారత్ అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

Advertisment
తాజా కథనాలు