AP: తిరుపతి విమానంలో భారీగా పొగలు.. ఆందోళనలో 65 మంది ప్రయాణికులు - హై టెన్షన్!
శంషాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన విమానంలో నిన్న సాంకేతిక లోపం తలెత్తింది. రన్‌వేపై వెళ్తుండగా పొగలు వచ్చాయి. గమనించిన పైలట్ విమానాన్ని ఆపేశారు. ఇంజిన్‌లోని సమస్యను సరి చేసి.. మళ్లీ స్టార్ట్ చేయగా వాసన రావడంతో నిలిపివేశారు. మొత్తంగా రాత్రి బయల్దేరింది.
Seat 11A Mystery: 11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్ సీటు నెంబర్ 11A చర్చనీయాంశమైంది. 27ఏళ్ల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనూ అదే నంబర్ సీట్లో కూర్చున్న నటుడు రువాంగ్సాక్ బతికిపోయారు. ఇదే విషయాన్ని అతడు ఫేస్బుక్ ద్వారా తెలిపాడు.
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. తల్లి కళ్ల ముందే కాలిపోయిన కన్నకొడుకు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో టీ స్టాల్ వద్ద నిద్రిస్తున్న 16 ఏళ్ల ఆకాష్ మంటల్లో చిక్కుకుని మరణించాడు. ప్రమాదం సమయంలో అతని తల్లి సీతాబెన్ టీ చేస్తోంది. తన కొడుకు మంటలతో కాలిపోతుండటంతో అతన్ని కాపాడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.
Plane Crash : భర్త బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం లండన్ వెళ్తూ.. అనంతలోకాలకు
ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్‌లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది.
Ahmedabad Plane Crash: కాలిబూడిదైన విమానం.. చెక్కు చెదరని భగవద్గీత (వీడియో)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవత్ గీత మాత్రం చెక్కు చెదర్లేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవత్గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Electronic Devices Ban on Planes: ఈ 4 గాడ్జెట్లను విమానంలో తీసుకెళ్తే చాలా డేంజర్.. ప్రాణాలే పోతాయ్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భద్రతా నియమాలను పాటించడం మరింత ముఖ్యంగా మారింది. 27000 mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను విమానంలో తీసుకెళ్లకూడదు. ఇ-సిగరెట్లు, వేప్ పరికరాల వినియోగం కూడా కొన్ని విమానాల్లో నిషేదం. వీటిలో స్మార్ట్ బ్యాగులు ఉన్నాయి.
Trending Topics: ప్రాణాలకు గ్యారెంటీ లేదు బ్రో.. మొన్న పహల్గామ్, నిన్న బెంగళూరు, నేడు అహ్మదాబాద్..!
ప్రాణం ఎప్పుడు, ఎలా పోతుందో చెప్పలేం. ఇటీవల కాలంలో జరిగిన ఇన్సిడెంట్సే నిదర్శనం. ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పులో 26 మంది టూరిస్టులు, బెంగళూరులో జూన్ 4న తొక్కిసలాటలో 11మంది అభిమానులు, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం జరిగితే ఎయిరిండియా పరిహారం ఎంత?.. ప్రయాణ బీమా లేకపోతే ఏమవుతుంది? నియమాలు ఏంటి?
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రయాణబీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?, విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.