Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఒహియోలో సెస్నా 441 అనే చిన్న ట్విన్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో ఆరుగురు మృతి చెందారు.

New Update
Plane Crash Six Dead in Fatal Twin-Engine Plane Crash Minutes After Takeoff from Ohio Airport

Plane Crash Six Dead in Fatal Twin-Engine Plane Crash Minutes After Takeoff from Ohio Airport

అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఒహియోలో సెస్నా 441 అనే చిన్న ట్విన్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో ఆరుగురు మృతి చెందారు. అందులో ఇద్దరు సిబ్బంది, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. 

Plane Crash Six Dead

బాధితుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని కరోనర్ కార్యాలయానికి తరలించారు. విమానంలో ఉన్న వారి పేర్లు ఇంకా విడుదల కాలేదు. ఇటీవలి చరిత్రలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత ప్రాణాంతకమైన సంఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఈ ఘోరమైన ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు NTSB దర్యాప్తును నిర్వహిస్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు