Air India Flights Cancel: షాకింగ్.. మరో 8 ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్

ఎయిర్ ఇండియా ఈరోజు 8 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ కారణంగా వీటిని క్యాన్సిల్ చేశారు. కాగా విమాన ప్రమాదం తర్వాత జూన్ 12 - 17 మధ్య మొత్తం 83 విమానాలు రద్దు చేశారు.

New Update
air india cancelled 8 international and domestic flights today

air india cancelled 8 international and domestic flights today

ఎయిర్ ఇండియా ఇవాళ తన 8 విమానాలను మళ్ళీ రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి.

అంతర్జాతీయ విమానాలు

దుబాయ్ నుండి చెన్నై విమానం AI906
ఢిల్లీ నుండి మెల్బోర్న్ విమానం AI308 
మెల్బోర్న్ నుండి ఢిల్లీ విమానం AI309
దుబాయ్ నుండి హైదరాబాద్ విమానం AI2204 ఉన్నాయి. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

దేశీయ విమానాలు

పూణే నుండి ఢిల్లీ విమానం AI874
అహ్మదాబాద్ నుండి ఢిల్లీ విమానం AI456
హైదరాబాద్ నుండి ముంబై విమానం AI-2872
చెన్నై నుండి ముంబై విమానం AI571 రద్దు చేయబడ్డాయి. 

ఈ విమానాలు మెయింటినెన్స్, కార్యాచరణ కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయి.

Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

విమాన ప్రమాదం తర్వాత రద్దైనవి

2025 జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం తర్వాత అనేక ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. అందులో కొన్ని అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. మరికొన్ని విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇంకొన్ని విమానాల మార్గాన్ని మళ్లించారు. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రమాదం తర్వాత జూన్ 12 - 17 మధ్య మొత్తం 83 విమానాలు రద్దు చేశారు. వాటిలో 66 విమానాలు బోయింగ్-787 ఉన్నాయి. 

Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

అంతర్జాతీయ విమానాల సంఖ్య తగ్గింపు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమానాలను తగ్గించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే విమానాల సంఖ్యలో 15 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. ఇది జూలై 15 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. దాదాపు 20 అంతర్జాతీయ మార్గాల్లో వారానికి విమానాల సంఖ్య 38 నుండి తగ్గించారు. ఢిల్లీ -నైరోబి, అమృత్‌సర్‌-లండన్‌(గాత్విక్‌), గోవా(మోపా)-, లండన్‌(గాత్విక్‌) మధ్య విమాన సర్వీసులు జూలై 15 వరకు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు