/rtv/media/media_files/2025/07/29/operation-mahadev-2025-07-29-09-44-14.jpg)
జమ్మూకశ్మీర్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్ మహదేవ్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రదారి, మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను జవాన్లు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అతనితోపాటు మరో ఇద్దరు టెర్రరిస్టులు కాల్పుల్లో చనిపోయారు. వీరిని లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు. సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టారు. పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్.. సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను మన జవాన్లు మట్టుబెట్టారు. హషీమ్ మూసా గతంలో పాక్ ఆర్మీలో పని చేశాడు. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులను యాసిర్, అబు హమ్జాగా గుర్తించారు. దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం పేరు ఆధారంగా జులై ప్రారంభంలోనే ‘ఆపరేషన్ మహదేవ్’ లాంచ్ చేసింది.
Op MAHADEV . #oprationmahadev..justice delivered by #IndianArmy. Operation conducted with clinical precision over a month..Example of extreme patience, perseverance, focus and will to deliver justice.
— Shams (@shams_gazelle) July 29, 2025
Jai Hind..Jai Hind ki Sena..@ChinarcorpsIA@NorthernComd_IA@adgpi
Salute. pic.twitter.com/gwDVROhIcS
సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మహదేవ్ పర్వతంపైన దట్టమైన అడవిలో చైనీస్ ఆల్ట్రా రేడియో కమ్యూనికేషన్ యాక్టివ్‌గా ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. ఆ డివైజ్‌ను టీ82 ఆల్ట్రా సెట్‌గా కన్‌ఫార్మ్ చేసుకున్నది. సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులే ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌ల కోసం చైనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్‌ను ఉపయోగిస్తుంటారు. వెంటనే బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఉదయం 8 గంటలకు డ్రోన్ ఎగురవేశారు. 9.30 కల్లా టెర్రరిస్టుల లొకేషన్‌ను గుర్తించారు.
రాష్ట్రీయ రైఫిల్ టీం, పారా స్పెషల్ కమాండో దళాలు 10 గంటలకల్లా మహదేవ్ కొండపైకి చేరుకున్నాయి. టెర్రరిస్టుల కదలికలను గుర్తించిన కమాండోలు 11 గంటలకు కాల్పులు ప్రారంభించారు. 11.45 గంటలకు వెళ్లి చూడగా.. ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయి ఉన్నారు. గాయపడిన మరో టెర్రరిస్టు పారిపోతుండగా బలగాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి 2 కి.మీ. చుట్టుపక్కలా కూంబింగ్ చేపట్టారు. 12.45 గంటలకు డెడ్‌బాడీలను గుర్తించి ఫొటోలు తీసుకున్నారు. మొత్తం 3 గంటల్లోనే ‘ఆపరేషన్ మహదేవ్’ను సక్సెస్ చేశారు. దట్టమైన అడవిలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్‌వేసుకొని టెర్రరిస్టులు దాక్కున్నట్లు గుర్తించారు. మొత్తం ఐదు నుంచి ఏడుగురు టెర్రరిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.