/rtv/media/media_files/2025/07/30/trf-2025-07-30-11-51-37.jpg)
భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్తగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. TRF అనేది పాకిస్తాన్ ఆధారిత లష్కరే తాయిబా (LeT) సంస్థకు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. UN భద్రతా మండలి నేరుగా TRFపై ఆంక్షలు విధించాలని భారత్ ప్రయత్నిస్తోంది. దానికి అమెరికా మద్దతు లభించింది. TRFని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది.
A BIG VICTORY for Team India ! UNSC monitoring report has mentioned TRF as a terror organization wrt the Pahalgam Terror attack! We all know Total Resistance Front is the new name Lashkar-e-Taiba! Remember currently India does not have a member in UNSC & Pakistan chairs it yet we…
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 30, 2025
ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తరువాత, ఈ సంస్థపై ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలు విధించేందుకు భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత బృందం UN 1267 ఆంక్షల కమిటీతో కూడా చర్చలు జరిపింది. అలాగే UN భద్రతా మండలి ఆంక్షల పర్యవేక్షణ బృందం తాజాగా విడుదల చేసిన నివేదికలో పహల్గాం దాడికి TRF 2సార్లు బాధ్యత వహించిందని, దాడి జరిగిన ప్రదేశం ఫోటోను కూడా ప్రచురించిందని పేర్కొంది. ఈ దాడి లష్కరే తాయిబా మద్దతు లేకుండా జరగడం అసాధ్యమని కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు.
The UN Security Council Monitoring Committee has clearly identified The Resistance Front (#TRF), a proxy of Pak-based terror group LeT, as the organizer of the recent #PahalgamTerrorAttack.
— Alka Sharma (@AlkaSharma011) July 30, 2025
No more denials, #Pahalgam massacre was a state-sponsored slaughter.@LevinaNeythiripic.twitter.com/2rhKJEJWT4
భారత ప్రభుత్వం 2023 జనవరిలోనే 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను 'చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం' (UAPA) కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పహల్గాం దాడిని ఖండిస్తూ UN భద్రతా మండలిలో తీసుకున్న తీర్మానంలో TRF పేరును చేర్చకుండా పాకిస్తాన్ అడ్డుకుందని, ఆ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్వయంగా ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆయన తన మాట మార్చి, TRFపై ఆంక్షలకు తమకు అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం.
UN భద్రతా మండలి నివేదికలో పహల్గాం దాడికి TRF 2సార్లు బాధ్యత వహించిందని, దాడి జరిగిన ప్రదేశం ఫోటోను కూడా ప్రచురించిందని పేర్కొంది. ఇది ఇండియాకు పెద్ద విజయం అనే చెప్పుకోవాలి. అలాగే పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల్లో ముగ్గురు ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం జరిగిన ఆపరేషన్ మహదేవ్‌లో హతమైయ్యారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరులో వరుసగా విజయాలు సాధిస్తోంది.