India-Pak: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..

మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్‌ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి.

New Update
50 terrorists tried to enter India under cover of Pakistani shelling on May 8, Says BSF

50 terrorists tried to enter India under cover of Pakistani shelling on May 8, Says BSF

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్‌లోకి పెద్దఎత్తున ఉగ్రమూకలను పంపించేందుకు పాక్ యత్నించింది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) ఈ విషయాన్ని వెల్లడించింది. మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్‌ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి. 

Also read: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు..ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

BSF డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ ఎస్‌ఎస్‌ మండ్‌ ఓ మీడియా సంస్థతో దీనిపై మాట్లాడారు. '' మన జవాన్లు వాళ్లకు తీవ్రంగా నష్టం కలిగించారు. పాక్ నుంచి భారీగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నారని మాకు ముందుగానే సమాచారం అందింది. వాళ్ల కోసం కాచుకు కూర్చొని ఉన్నాం. వారిని గుర్తించగానే దాడులు చేశాం. ఆ గ్రూప్‌లో దాదాపు 45 నుంచి 50 మంది వరకు ఉన్నారు. వాళ్లు మావైపు వచ్చినప్పటికీ మేము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాం.   

Also Read: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. మేము అత్యంత కచ్చితత్వంతో కాల్పులకు దిగాం. దీంతో ఆ ఉగ్రవాదులు తమ పోస్టులు వదిలేసి పారిపోయారు. గంటన్నర లోనే మేము వారికి బుద్ధి చెప్పాం. వాళ్ల ఆయుధాలు, బంకర్లను ధ్వంసం చేశాం. బీఎస్‌ఎఫ్‌లో మహిళా జవాన్లు కూడా పురుషులతో పాటు సమానంగా శత్రువులపై పోరాడారు. వీళ్లని చూస్తే మాకు గర్వంగా ఉందని'' జనరల్‌ ఎస్‌ఎస్‌ మండ్‌ తెలిపారు. 

Also Read: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు..ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

Also Read: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో కెనడా.. మార్క్‌ కార్నీ కీలక ప్రకటన

telugu-news | national-news | pahalgam | terrorists

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు