/rtv/media/media_files/2025/05/21/KkWlHEhj1iUjhQp7wQX0.jpg)
Terrorists Roaming in Army Dress, Know Details
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉగ్రవాదుల ముప్పుతో వణికిపోతున్న జమ్మూకశ్మీర్‌కు మరిన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. పలువురు ఉగ్రవాదులు ఏకంగా సైనిక దుస్తులు ధరించి సంచరిస్తున్నారు. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య తేడా తెలియక సతమతమవుతున్నారు. భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాదుల ముప్పును పసిగట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also read: సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం.. దేశంలోనే టాప్
పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 22న టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆరోజు కూడా ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లోనే వచ్చి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేట కొనసాగిస్తోంది. జనావాసాల్లో ఉంటున్న పలువురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లకి లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని చెబుతున్నారు.
Also Read: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ
అంతేకాదు ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పలు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. అప్పుడు కూడా ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు తెలుస్తోంది. ప్రజలు, భద్రతా బలగాలను తమకు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఉగ్రవాదులు ఇలాంటి మార్గం ఎంచుకుంటున్నారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు సమాచారం.
Also Read: చైనాలో భారత్ పరువు తీసిన జ్యోతి మల్హోత్రా...క్షమాపణలు చెప్పినా..
Also Read: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ప్రమోషన్.. సోషల్ మీడియాలో జోకులు
pahalgam | telugu-news | terroristసైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు.. భయాందోళనలో ప్రజలు