/rtv/media/media_files/2025/01/09/DYUwfpM7hcptLY5hmxPa.jpg)
omar abdullah
మామూలుగా అయితే జమ్మూ , కాశ్మీర్ లో వేసవిలో అయితే శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ రాజధానిగా ఉంటాయి. మొదటి నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన ఇలాగే కొనసాగుతోంది. ఏ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు చోట్లే సమావేశాలు జరుగుతాయి. అయితే మొట్టమొదటిసారిగా పహల్గాంలో మంత్రివర్గ సమావేశాన్ని జరపాలని నిర్ణయించింది ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం. ఇక్కడ దాడి జరిగిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ అల్లకల్లోలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సమావేశం నిర్వహిస్తే ప్రజల్లో కొంత ధైర్యం వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : కొత్త పార్టీ పెడుతున్నా.. జాగృతి నేతలతో కవిత సంచలన భేటీ!
Also Read : జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్.. దళ కమాండర్ మృతి
పూర్వ పరిస్థితులు వచ్చేందుకే..
ఉగ్రదాడి తర్వాత జమ్మూ, కాశ్మీర్ లో పర్యాటకులు తగ్గిపోయారు. దీంతో అక్కడి బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఒమర్ అబ్దుల్లో ఎక్కడ దాడి జరిగిందో అదే పహల్గాంలో కేబినెట్ భేటీ జరపాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పర్యాటకులకు, స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది. అయితే కేబినెట్ భేటీ అజెండా ఏంటో ప్రకటించలేదు. అయినప్పటికీ హింసకు జమ్మూ, కాశ్మీర్ లో చోటు లేదని సందేశాన్ని ఇచ్చేందుకే దీన్ని నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా సీఎం ఒమర్ ఇదే విషయాన్ని చెప్పారు. ప్రజల్లో నెలకున్న భయాందోళనలు తొలగించి..శాంతి, భద్రతలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. జమ్మూ, కాశ్మీర్ లో పర్యాటక రంగం మళ్ళీ పుంజుకునేలా చేసి...తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా కృషి చేస్తామని తెలిపారు. దీని కారణంగా ఇప్పుడు పహల్గాం లో కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
today-latest-news-in-telugu | pahalgam | Jammu and Kashmir Chief Minister Omar Abdullah | cabinet-meeting
Also Read: Pakistan: ఆ మూడింటిని భారత్ తో చర్చించేందుకు సిద్ధం..పాక్ ప్రధాని
Also Read : నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..వెంటాడుతున్న కరోనా భయం?